Quantcast
Channel: Kisan Updates
Viewing all articles
Browse latest Browse all 57

సేంద్రియ రొయ్యలు పెంపకం పై ద్రుష్టి సారించిన ఎంపెడా

$
0
0

సేంద్రియ వ్యవసాయం, కూరగాయల లాగ ఇక సేంద్రియ రొయ్యలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. విదేశాల్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) సేంద్రియ ఆక్వా కల్చర్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ ఇంపో ర్టు ప్రమోషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఐపిపిఒ) సహకారంతో ఇండి యా ఆర్గానిక్ ఆక్వాకల్చర్ ప్రాజెక్టు (ఐఒఎపి)ను ఎంపెడా చేపట్టింది. ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్, కేరళలో ఫ్రెష్ వాటర్‌లో రొయ్యల సాగును సేంద్రియ విధానంలో సాగు చేసేందుకు ఎంపెడా ప్రోత్సహిస్తున్నది. సీడ్ సహా దాణా కూడా సేంద్రియ విధానంలో అభివృద్ధి చేసినవే ఉపయోగిస్తారు. రాష్ట్రం నుంచి వివిధ సముద్ర ఉత్పత్తులు దాదాపు ఏటా 7,000 కోట్ల రూపాయల వరకూ ఎగుమతి అవుతుంటాయి. అందులో ఎక్కువ భాగం రొయ్యలదే.
సముద్ర రొయ్యల లభ్యత తగ్గుతుండటం ఆందోళన కల్గిస్తున్నది. దీనికి తోడు గతంలో రాష్ట్రం నుంచి వెనామి రకం రొయ్యల ఎగుమతిపై యాంటిబయాటిక్స్ వినియోగం ప్రభావం చూపింది. అయితే దేశంలో రొయ్యల సాగును పర్యవేక్షించే కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ రొయ్యల పెంపకంలో కొన్ని రకాల యాంటిబయాటిక్స్ వినియోగాన్ని అనుమతించింది. అయతే రొయ్యల సాగులో ఎక్కువగా వినియోగించే కొన్ని రకాల యాంటిబయోటిక్స్‌ను యూరోపియన్ యూనియన్ నిషేధించింది. నిషేధిక యాంటిబయాటిక్స్ అవశేషాలు రొయ్యల్లో ఉన్నట్లు గుర్తించిన యూరోపియన్ యూనియన్ వాటిని తిరస్కరించిన సందర్భాలు ఉన్నా యి. దీనిని దృష్టిలో ఉంచుకుని సేంద్రియ విధానంలో రొయ్యల సాగును చేపట్టేందుకు నిర్ణయించారు. సేంద్రియ ఎరువులు, శుద్ధ చేసిన ఆవుపేడ వంటివి ఉపయోగించి తయారు చేసిన సూక్ష్మ పోషకాలు, ఒక రకమైన నాచు వంటివి వినియోగించి రొయ్యల చెరువు అభివృద్ధి చేస్తారని ఎంపెడా ఆంధ్ర డివిజన్ (ఆక్వాకల్చర్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ స్కందన్ తెలిపారు. సాధారణగా ప్రత్యేక నాచు తయారు చేసేందుకు రసాయనిక పదార్థాలు ఉపయోగిస్తారని వివరించారు. సీడ్ కూడా సేంద్రియ విధానంలో తయా రు చేసి అధీకృత డీలర్లు సరఫరా చేస్తారని వివరించారు.
జర్మనీకి చెందిన ఒక సంస్థ సేంద్రియ రొయ్యల సాగుకు సంబంధించి ఒక అధ్యయనం చేసి ఇందుకు అనువుగా ఉన్న ప్రాంతాలుగా కేరళ, ఆంధ్రప్రదేశ్‌లను గుర్తించింది. 52 హెక్టార్లలో ఫ్రెష్ వాటర్, 10 హెక్టార్లలో బ్రేకిష్‌వాటర్‌లో చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందుకు అవసరపైన టైగర్ సీడ్‌ను ఎంపిక చేసిన హ్యాచరీల నుంచి సరఫరా చేస్తున్నారు. అయితే సేంద్రియ విధానంలో రొ య్యల సాగును చేపట్టాలని భావిం చే రైతులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్ప ష్టం చేశారు. ఉభయ గోదావరి జిలా లల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని, రైతులకు సీడ్, దాణా రాయితీపై సరఫరా చేస్తున్నామన్నారు.

 

Empeda Focuses on Organic Shrimp Culture

The post సేంద్రియ రొయ్యలు పెంపకం పై ద్రుష్టి సారించిన ఎంపెడా appeared first on Kisan Updates.


Viewing all articles
Browse latest Browse all 57

Trending Articles