Quantcast
Channel: Kisan Updates
Viewing all articles
Browse latest Browse all 57

2020 నాటికి దేశంలో 60 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు

$
0
0

దేశంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం  అన్నిరకాలుగా కృషి చేస్తుంది. రైతాంగానికి కావాల్సిన సదుపాయాలను కల్పించనుంది. 2020 నాటికి దేశంలోని 60 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుందని ఎంపెడా ఛైర్మన్ జయతిలక్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వశాఖలతో పాటు రైతాంగం పూర్తిగా సహకరించాలని కోరారు. శుక్రవారం భీమవరంలో సముద్ర ఎగుమతుల సంస్ధ (ఎంపెడా) వివిధశాఖల అధికారులు, ఆక్వా రైతులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

ఈ సమావేశానికి మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపెడా చైర్మన్ జయతిలక్ మాట్లాడుతూ దేశంలోని అధికశాతం ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రేనని తెలిపారు. ఈ రాష్ట్రంలో కేవలం 19 కిలోమీటర్ల మేర సముద్రతీర ప్రాంతమున్న పశ్చిమగోదావరి జిల్లా నుంచే ఎగుమతులు జరుగుతున్నాయని ఎంపెడా భారత ప్రభుత్వానికి నివేదించిందన్నారు. ఎన్నో అష్టకష్టాలు పడుతున్న ఆక్వా రైతాంగాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు. ఈ ప్రాంతం నుండి రొయ్య ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీంతో పాటు దేశీయ మార్కెట్‌లో చేపలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పీతల పెంపకం కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతుందన్నారు. దేశానికే ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో అత్యధిక ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు ఎంపెడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందని జయతిలక్ చెప్పారు.

మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా రంగాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మత్స్య సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా అని, ఇక్కడి రైతులు తమకు తాముగా పరిశోధనలు చేసి మత్స్య సంపను పెంచుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ డెల్టాప్రాంతం వరిపండించేందుకు అనుకూలమైందన్నారు. నాడు కాటన్ మహాశయుడు తిండి గింజలు పండించడానికి గోదావరి జలాలను ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ఎంతో చైతన్యవంతమైన డెల్టా రైతాంగం ఆక్వా రంగం పైనే అధిక ఆదాయం వస్తుందని గుర్తించి, ఈ రంగం పై దృష్టిసారించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని ఆక్వా జోన్‌లను గుర్తించి ఈ ఉత్పత్తులను పెంచేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎగుమతుల్లో భీమవరానికి టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని భారత ప్రభుత్వం ప్రకటించిందని, కాని ఇంతవరకు నిధులు విడుదల కాలేదన్నారు. ఈ నిధులు విడుదలైతే ఆక్వా రంగానికి చేయూతనివచ్చునన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి అవసరమైన ఫుడ్‌పార్కులను ఏర్పాటుచేసుకోవడం, విద్యుత్ సరఫరా ఏర్పాటు, ఆక్వా సాగు అభివృద్ధి చేయడం, రహదారులు, డ్రైయిన్లు నిర్మాణం వంటివి చేసుకోవచ్చునన్నారు. దీనిపై స్పందించిన ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వివిధశాఖల అధికారులు, రైతులు ఆక్వా రంగ అభివృద్ధికి ఎంపెడాకు సలహాలు, సూచనలు అందించారు.

 

60 billion metric tonnes aqua exports by 2020

The post 2020 నాటికి దేశంలో 60 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు appeared first on Kisan Updates.


Viewing all articles
Browse latest Browse all 57

Trending Articles