అమెరికా వంటి పెద్దదేశాలు భారత్ రొయ్యలలో యాంటీబయోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉందని ప్రకటించి హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎగుమతుదారుల వెన్నులో వణుకు పుట్టింది. దీంతో భీమవరంలో ఆదివారం రొయ్య రైతులు, ట్రేడర్లతో యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన సదస్సును సీడ్‌ఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎపి రీజియన్) ఏర్పాటుచేసింది. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు ఎ ఇంద్రకుమార్, జాతీయ కమిటీ సభ్యులు తోట జగదీష్, ఉపాధ్యక్షులు డాక్టర్ యిర్రింకి సూర్యారావు, ఆక్వా కల్చర్ కమిటీ చైర్మన్ సి రాజగోపాల్ చౌదరి, పశ్చిమగోదావరి జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వి సత్యనారాయణరాజు, ఎక్స్‌పోర్టర్లు ఉద్దరాజు రమేష్‌వర్మ, జి పవన్‌కుమార్ మాట్లాడారు. అలాగే రైతులు కూడా వారి అభిప్రాయాలను వెల్లడించారు.
సమావేశంలో ఇప్పటి నుండి యాంటీ బయోటిక్స్ వినియోగించిన రొయ్యలను కొనుగోలు చెయ్యమని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అలాగే రైతులు, ఎగుమతిదారులు, సీడ్ అమ్మకందారులు, హ్యాచరీలు, ఎంపెడా, మత్స్యశాఖ తదితరులతో త్వరలోనే ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. గతంలో కంటే ఇప్పుడు విదేశాలు 60 నుంచి 70 కౌంట్ ఉన్న రొయ్యలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు ఈ రకానికి చెందిన రొయ్యలను కొనుగోలు చేస్తామని తెలిపారు. అయితే ఈ చిన్నరకానికి చెందిన వాటికే రైతులు ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నా పశ్చిమబెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో రొయ్యలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారన్నారు. హ్యచరీలు, కెమికల్ కంపెనీలు, ఫీడ్ వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. గతంలో టైగర్ రొయ్య అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ఇప్పుడు వనామీ రొయ్య పూర్తిగా వ్యాపారాన్ని నష్టానికి గురిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరో లక్ష ఎకరాల్లో సాగును విస్తీర్ణం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించాలని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Vannamei shrimp exporters worries
The post ఎగుమతిదారులను వణికిస్తున్నవనామీ appeared first on Kisan Updates.