Quantcast
Channel: Kisan Updates
Viewing all articles
Browse latest Browse all 57

వైట్ స్పాట్ నిర్దారణకు తక్కువ ఖర్చుతో వేగవంతమయిన పరీక్ష

$
0
0

వైట్ స్పాట్ డిసీజ్ ప్రపంచ వ్యాప్తంగా వెనామీ రైతులకు నష్టాలను కలుగచేస్తున్నది.  ఇండియా లోనే ప్రతి సంవత్సరం  1800 కోట్లు నష్టాలు దీని  వల్ల  వస్తున్నాయి.  వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్  (WSSV ) వల్ల  ఈ వ్యాధి రొయ్యల్లో వ్యాపిస్తుంది.  PCR టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని లాబొరేటరీలో  నిర్దారిస్తారు. దీనికి 3 – 5 రోజుల సమయం పడుతుంది. ఈ వ్యాధి ని  నిర్దారించే లోపు ఇది మరింతగా వ్యాప్తిస్తుంది.

20 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ

అగార్కర్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్( ARI ) శాస్త్రవేత్తలు   త్వరిత గతిన కేవలం 20 నిమిషాల్లో చెరువు దగ్గరే పరీక్షించుకునే విధంగా ఓక స్ట్రిప్ ను తయారు చేసారు. దీని పై  రొయ్య గ్రిల్ పై ఉండే ద్రవాన్ని  ఈ స్ట్రిప్ పై వేస్తె 20 నిమిషాల్లో ఇది వ్యాధిని నిర్దారిస్తుంది.  దీని ద్వారా చాలా ముందు స్టేజ్ లోనే వైట్ స్పాట్ వ్యాధి నివారణకు అవకాశం ఉంటుంది.

strip

ARI డైరెక్టర్ కిశోర్  మాట్లాడుతూ, వైట్ స్పాట్ డిసీజ్ త్వరితగతిన అంటే కేవలం 3 నుంచి 10 రోజుల్లో మొత్తం అన్ని రొయ్యలకు వ్యాపిస్తుంది.  ప్రస్తుతం లాబొరేటరీలో చేసే టెస్ట్ కు ఎక్కువ సమయం మరియు నిపుణులు, పరికరాలు అవసరం అంతేకాకుండా ప్రతి శాంపిల్ కు 1000 రూపాయలు వరకు అవుతుంది.

అతి తక్కువ ఖర్చు

ARI కనిపెట్టిన విధానంలో కేవలం 100 నుంచి  200 రూపాయల ఖర్చుతో ఒక చిన్న స్ట్రిప్ సహాయంతో చెరువు దగ్గరే రైతు 20 నిమిషాల్లో వ్యాధి నిర్దారణ చేయవచ్చు.  అంతే కాకుండా హేచరీ మరియు లేబొరేటరీలు కలిసి రైతులకు తప్పుడు ఫలితాలు ఇవ్వడం ద్వారా రైతుల మోసపోకుండా నివారించవచ్చు.

 

Rapid Detection of White Spot Syndrome Virus

The post వైట్ స్పాట్ నిర్దారణకు తక్కువ ఖర్చుతో వేగవంతమయిన పరీక్ష appeared first on Kisan Updates.


Viewing all articles
Browse latest Browse all 57

Trending Articles