ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రూ.18 లక్షలతో ఆక్వా రైతాంగం కోసం మొబైల్ ల్యాబ్‌ను ల్యాబ్‌ను ఎస్‌బిఐ జిఎం రవీంద్ర పాండే ప్రారంభించారు. ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా శాస్తవ్రేత్తలు వారి సమస్యలను పరిష్కరిస్తారని జిఎం చెప్పారు. దేశానికి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకువస్తున్న ఆక్వా రైతాంగానికి మొబైల్ ల్యాబ్ చాలా అవసరమని గుర్తించి ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు మాట్లాడుతూ రొయ్యలు, చేపల రైతులు వాటికి వచ్చే వ్యాధులు వల్ల కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని, అందుకోసం వారి చెరువుల వద్దకే వెళ్లి శాస్తవ్రేత్తలు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. నీటి పరీక్షలతో పాటు సాల్ట్, నైట్రేట్, ఆక్సిజన్, అమ్మోనియా, మైక్రో బయోలజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ప్రకటించారు. ఇటీవల కాలంలో రొయ్యల పెంపకంలో యాంటిబయోటిక్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారని, వీటి వినియోగం నుంచి ఆక్వా రైతాంగానికి సేంద్రీయ పద్ధతులకు తీసుకువచ్చి చైతన్యం కల్పించడమే మొబైల్ ల్యాబ్ లక్ష్యమన్నారు
The post మొబైల్ ఆక్వా ల్యాబ్ ను ప్రారంభించిన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ appeared first on Kisan Updates.