ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రైతులు కాలం చెల్లిన పంపుసెట్ల స్థానంలో, ఆధునిక పరిజ్ఞానంతో వచ్చిన పంపుసెట్లను వాడి ఇకనుండి విద్యుత్తును ఆదా చేసుకోవచ్చు. 5 హెచ్‌పీ మోటర్లను, 3.5 హెచ్‌పీ సామర్థ్యంతోనే ఫైవ్ స్టార్ రేటింగ్‌తో అందిస్తున్నాయి. స్మార్ట్ కంట్రోల్ ప్యానెల్‌తో వస్తున్న ఈ పంపుసెట్లలో స్మార్ట్ మీటర్, సిమ్ కార్డులు ఉంటాయి. రిమోట్ సెన్సార్ పరిజ్ఞానం కూడా ఉంది. రైతులు ఇంటిలో ఉన్నా.. బయట పనిలో ఉన్నా తమ సెల్‌ఫోన్ ద్వారా పంపుసెంటును ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. రైతులు రాత్రిపూట చీకట్లో పొలాలకు వెళ్లి నీళ్లు వదలే ఇబ్బంది ఉండదు. ఇంటి దగ్గరే కూర్చొని పొలాన్ని తడుపుకోవచ్చు. ఈ పంపుసెట్ ద్వారా 30 శాతం విద్యుత్తు ఆదా అవుతుంది. కొన్ని మండలాలను ఎంపిక చేసి రైతులకు ఉచితంగా పంపుసెట్లు అందజేస్తారు.
Smart Pumps for Farmers
The post రైతులకు రిమోట్ పంపు సెట్లు appeared first on Kisan Updates.