సూర్యలంక సముద్రతీరంలో క్రాబ్ (పీతలు), పండుగప్పల (పండుచేపలు) హేచరీలు రానున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి సేకరించిన సుమారు 10 ఎకరాల స్థలాన్ని మత్స్యశాఖ కమిషనర్ రాం శంకర్‌నాయక్ ఆదివారం పరిశీలించారు. రెండు హేచరీల ద్వారా ఆక్వా రైతులకు పిల్లలు ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. హేచరీల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదగా శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన రొయ్య పిల్లల హేచరీలను సందర్శించారు. హేచరీస్ అసోసియేషన్ నాయకులతో చర్చించారు. అసోసియేషన్ నాయకులు వారి సమస్యలను వినతిపత్రం ద్వారా కమిషనర్‌కు వివరించారు. సీజన్ లేని సమయంలో రొయ్య పిల్లలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్ కార్గో సౌకర్యం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ కోరారు. విద్యుత్ పరంగా సబ్సిడీ ఇవ్వాలని , రొయ్య పిల్లలకు సంబంధించిన ఇన్‌ఫుట్‌పై సబ్సిడీ ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మత్స్యశా ఖ డీడీ ఎం.బలరాంనాయక్, ఎంపెడా డీడీ కందన్, మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఎ.ఉషాకిరణ్, తహశీల్దార్ తిరుమలశెట్టి వ ల్లయ్య, జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంత నగే్‌షబాబు, అసోసియేషన్ నాయకులు పా ల్గొన్నారు.
Crab hatchery in suryalanka
The post సూర్యలంకలో క్రాబ్, పండుగప్పల హేచరీలు appeared first on Kisan Updates.