రాబోయే కాలంలో రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఉపకరించే కొత్త సాగు పథకాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించిన సమాచారాన్ని వారికి అందిస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఈ-అగ్రికల్చర్ మార్కెటింగ్, సమీకృత సాగు విధానం, ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన, భూసారం, పశుసంవర్ధకం తదితర పథకాలపై విడివిడిగా వర్క్‌షాపులు నిర్వహిస్తారు. వ్యవసా యం, ఉద్యానపంటలు, పశు సంవర్ధకం, నవీన ఆధునిక సాంకేతికతలు, యంత్రాల సాగుపై ప్రదర్శనలుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రదర్శనకు 500 స్టాళ్లు ఏర్పాటుచేశాయి. 19 నుంచి 21వరకు జరిగే ఈ మేళాను దేశవ్యాప్తంగా బ్లాక్ స్థాయిలో తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
వరుస కరువులు వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రైతులు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. నీటి పొదుపుతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. రెట్టింపు ఆదాయం పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడిపరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ, కోళ్ల పెంపకం చేపట్టాలని సూచించారు. ‘కిసాన్ సువిధ’ అనే మొబైల్ అప్లికేషన్‌ను రైతుల కోసం ఆయన ప్రారంభించారు. వాతావరణం, మార్కెట్ ధరలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, వ్యావసాయిక యంత్రాలు వంటి వాటి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
PM Modi inaugurate Krishi Unnati Mela
The post కృషి ఉన్నతి మేళా ను ప్రారంభించిన ప్రధాని appeared first on Kisan Updates.