యురోపియన్ యూనియన్ (EU) ఇండియా నుంచి వచ్చే ఆక్వా కల్చర్ ఉత్పతుల పై చేసే పరీక్షలను కఠినం చేసింది. దీని ప్రభావం ఆక్వా ఎగుమతుల పై పడనుంది. బారత్ ఆక్వా ఎగుమతులకు EU ౩ వ అతిపెద్ద మార్కెట్.
సవరించిన నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తుల పరిక్షల కోసం తీసుకునే నమూనాలను మొత్తం మెటీరియల్ లో కనీసం 50 శాతం ఉండాలని బోర్డర్ ఇన్స్పెక్షన్ ను ఆదేశించింది. ఒకే షిప్ లో వేరు వేరు కంపనీ లకు సంబందించిన ఉత్పత్తులు ఉంటె వాటిని విడి విడిగా ప్రతి కంపనీ కి సంబందించిన ఎగుమతుల్లో 50% శాంపిల్ లు తీసుకుని పరీక్షించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇంతకముందు కనీసం 10 శాతం సాంపిల్స్ ను మాత్రమే పరిక్షించేవారు.
యురోపియన్ దేశాలకు చేసే ఎగుమతులు మన మొత్తం ఎగుమతుల్లో 20.71 శాతం తో మూడవ స్థానంలో ఉన్నాయి. మొదట రెండు స్తానల్లో అమెరికా(28.46), సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు (24.59) ఉన్నాయి . పరిమాణం ప్రకారం 2015-16 లో భారతదేశం నుంచి EU కి ఎగుమతి అయిన ఆక్వా ఉతప్త్తులు 9,45,892 టన్నులు.
EU అధికారిక లాబ్స్ చేపట్టిన పరీక్షల ఫలితాలు లో chloramphenicol, tetracycline, oxytetracycline, chlortetracycline and metabolites of nitrofurans ల స్థాయి సాధారణం కంటే అదికం గ ఉండటం తో ఈ సవరణను అవలంబిస్తున్నారు. తమ దేశ పౌరుల ఆరోగ్య ప్రమాదాలను తగ్గించటానికి ఇండియా నుంచి వచ్చే ఆక్వా ఎగుమతుల పై పరీక్షలను బలోపేతం చేస్తున్నాం అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దీని ప్రభావం మన ఆక్వా ఎగుమతుల పై పడుతుందని, ఎగుమతులు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఎగుమతి దారులు ఆందోళన చెందుతున్నారు.
భారత ఆక్వా ఉత్పత్తులపై నిబంధనలను కఠినం చేసిన యురోపియన్ యూనియన్
The post భారత ఆక్వా ఉత్పత్తులపై నిబంధనలను కఠినం చేసిన యురోపియన్ యూనియన్ appeared first on Kisan Updates.